పది బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేసుకుంటోన్న ‘వేదంత’

ABN , First Publish Date - 2022-01-24T00:37:42+05:30 IST

ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో... పలు సంస్థల విషయంలో ప్రైవేటు సంస్థలూ ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో... భారీ డీల్స్ కు సిద్దమవుతున్నాయి.

పది బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేసుకుంటోన్న ‘వేదంత’

న్యూఢిల్లీ : ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో... పలు సంస్థల విషయంలో ప్రైవేటు సంస్థలూ ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో... భారీ డీల్స్ కు సిద్దమవుతున్నాయి. తాజాగా వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను కొనుగోలు చేయడానికి పది బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలను సొంతం చేసుకునేందుకు కార్పస్ రెడీ చేసుకుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఎస్‌సిఐలో 12 బిలియన్ డాలర్లతో కీలక వాటాలను కొనుగోలు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇందుకోసం మేము 10 బిలియన్ డాలర్ల ఫండ్‌ను సిద్ధం చేస్తున్నట్టు కంపెనీ ఛైర్మన్ అగర్వాల్ ఒ సందర్భంలో వెల్లడించారు. ఈ ఫండ్ వేదాంత సొంత వనరులు, ఇతర పబ్లిక్ ఎంటర్‌ప్రెన్యూర్‌ల నుంచి  సమకూర్చుకుంటున్నట్లు వినవస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల వాటా విక్రయంలో పెట్టుబడి పెట్టేందుకు లండన్‌కు చెందిన సెంట్రిక్స్ తో వేదాంత జట్టుకట్టనున్నట్లు అగర్వాల్ గతంలోనే ప్రకటించారు. సెంట్రిక్స్ $28 బిలియన్ల అసెట్స్ కలిగి ఉంది.


త్వరలోనే బిడ్డింగ్....

బీపీసీఎల్, ఎస్‌సీఐల్లో దాని వాటా విక్రయానికి ప్రైస్ బిడ్ ఆహ్వానాన్ని ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో వాయిదా వేసింది. కాగా... బీపీసీఎల్, లేదా ఎస్‌సీఎల్ కోసం ప్రైస్ బిడ్‌లను ఆహ్వానించడానికి ప్రభుత్వం ఎటువంటి తేదీని ప్రకటించలేదు. 

Updated Date - 2022-01-24T00:37:42+05:30 IST