వేదాంగాలు అంటే...

ABN , First Publish Date - 2021-12-17T05:30:00+05:30 IST

ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం... ఈ చతుర్వేదాలను

వేదాంగాలు అంటే...

ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం... ఈ చతుర్వేదాలను అర్థం చేసుకోవడానికీ, వాటి ఉచ్చారణకు, వాటి ఉపయోగం ఏమిటో అవగాహన చేసుకోవడానికి అనుషంగికమైన ఆరు గ్రంథాలను పూర్వ మహర్షులు రూపొందించారు. అవే వేదాంగాలు.


కల్పం, శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం.. అనే ఈ ఆరు వేదాంగాలు గద్యరూపంలో ఉంటాయి. యజ్ఞ క్రతు నిర్వహణ తదితరాల గురించి వివరించేది - కల్పం. వేదమంత్రాలు, ఋక్కుల ఉచ్చారణను వివరించేది- శిక్ష. వ్యాకరణ సూత్రాలను చెప్పేది- వ్యాకరణం.  వేదాల్లోని శబ్దాలు, పదాల వ్యుత్పత్తినీ, అర్థాలను, వాటి స్వరూపాలను వెల్లడించేది- నిరుక్తం. వేదాల్లోని వివిధ ఛందస్సుల తీరుతెన్నులను తెలియజేసేది- ఛందస్సు. ఖగోళ శాస్త్రం గురించీ, ముహూర్త నిర్ణయం గురించీ వివరించేది- జ్యోతిషం.


Updated Date - 2021-12-17T05:30:00+05:30 IST