వేదగిరిపై పవిత్రోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-11-25T05:02:48+05:30 IST

వేదగిరి క్షేత్రంలో మంగళవారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో జరిగే తప్పిదాలు, లోపాలను తిరిగి అర్చక వేదపండితులతో సరిచేసుకునేందుకు నిర్వహించే ఈ ఉత్సవాలను ఈనెల 27వ తేదీ వరకు నిర్వహిస్తారు.

వేదగిరిపై పవిత్రోత్సవాలు ప్రారంభం

27 వరకు నిర్వహణ 


నెల్లూరురూరల్‌, నవంబరు 24 : వేదగిరి క్షేత్రంలో మంగళవారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో జరిగే తప్పిదాలు, లోపాలను తిరిగి అర్చక వేదపండితులతో సరిచేసుకునేందుకు నిర్వహించే ఈ ఉత్సవాలను ఈనెల 27వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ వేడుకలు ఆలయ ఈవో శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షణలో జరుగుతాయి. అందులో భాగంగా తొలిరోజు లక్ష్మీనరసింహస్వామి ఆలయలో విష్వక్సేన పూజ, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం అకల్షష హోమం, పంచగవ్య ఆరాధన, స్నపన తిరుమంజనం, 26న ఉక్తహోమం, సర్వదైవత్య హోమం, పవిత్ర సమర్పణ, అగ్నిప్రణయనం, కుంభారాధనలు నిర్వహిస్తారు. 27న సర్వగాయత్రీ హోమం, మహాపూర్ణాహుతి, యాత్రాదానంతో ఉత్సవాలు ముగిస్తాయి. ఈ కార్యక్రమాలను ప్రతి ఏటా ఆలయ ప్రాంగణంలో వైభవంగా నిర్వహిస్తామని ఆలయ చైర్మన్‌ ఇందుపూరు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-11-25T05:02:48+05:30 IST