విధులు సమన్వయంతో నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-09T06:38:47+05:30 IST

విధులు సమన్వయంతో నిర్వహించాలి

విధులు సమన్వయంతో నిర్వహించాలి
బూత్‌లెవల్‌ అధికారులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ టీవీ సతీష్‌

కంకిపాడు, ఆగస్టు 8 : బూత్‌లెవల్‌ అధికారులు తమ విఽధులను సమన్వ యంతో నిర్వహించాలని తహసీల్దార్‌ టి.వి.సతీష్‌ అన్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం బీఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ, మండలంలోని వివిధ గ్రామాల్లో మొత్తం 53,110 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 25646, మహిళలు 27463, ఒకరు ట్రాన్స్‌ జండర్‌  ఉన్నారన్నారు.  కొత్తగా ఓటరు నమోదు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. అందుకు అనుగుణంగా బీఎల్‌వోలు తమ విధులను ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని నిర్వహించాలని కోరారు. ఫాం నెం. 6 బీతో ఓటు నమోదు చేసే సమయంలో అవస రమైన ఆధార్‌ కార్డు లేని పక్షంలో ఓటు కార్డు, ఉపాధిహామీ జాబ్‌ కార్డు, స్మార్టుకార్డు, డ్రైవింగ్‌ లైనెన్స్‌, పాస్‌పోర్టు వంటి వాటిని కూడా తీసుకోవచ్చు అని సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్‌ బూత్‌లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ నాగరాజు, భవాని తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T06:38:47+05:30 IST