వాడవాడలా త్రివర్ణ శోభ

ABN , First Publish Date - 2022-08-09T06:40:16+05:30 IST

వాడవాడలా త్రివర్ణ శోభ

వాడవాడలా త్రివర్ణ శోభ
ఉంగుటూరులో త్రివర్ణ పతాకంతో ర్యాలీ

ఉంగుటూరు, ఆగస్టు 8 : ఉంగుటూరు  సోమవారం త్రివర్ణ శోభతో  కళకళలాడింది. స్వాతం త్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక జడ్పీహైస్కూల్‌ విద్యార్థులు, ఉపాధ్యాయులు అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పెద్దసంఖ్యలో పాల్గొని గ్రామంలో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 250 మీటర్ల పొడవైన జాతీయజెండా ర్యాలీని ఎంపీపీ వడ్లమూడి సరోజిని లాంఛనంగా ప్రారంభించారు. 

విద్యార్థులు మువ్వన్నెలజెండాలు చేతబూని వందేమాతరం, భారత్‌మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తించారు.  స్థానిక జడ్పీ హైస్కూల్‌ నుంచి ఉంగుటూరు ప్రధానసెంటర్‌ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. ఎంపీడీవో జీఎ్‌సవీ శేషగిరిరావు, తహసీల్దార్‌ డి.వనజాక్షి మాట్లాడుతూ, మహనీయుల త్యాగఫలమే నేటి మన స్వేచ్ఛాయుత జీవనానికి మూల బలం అన్నారు.  సర్పంచ్‌ కాటూరి వరప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి నర్రా ప్రసాద్‌, ఈవోపీఆర్డీ ఎం.అమీర్‌బాషా, పాఠశాల హెచ్‌ఎం. అట్లూరి ప్రభాకరరావు, ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స ఏపీవో వినీల, సీపీఎం మండలకార్యదర్శి అజ్మీర్‌ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 

గన్నవరం : స్వాతంత్య్ర సమరయోధులను స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని సీఐ కోమాకుల శివాజీ అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని సోమవారం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భం గా సీఐ మాట్లాడుతూ, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య ఆదర్శనీ యులని కొనియాడారు. జాతీయ పతాక విశిష్టతను వివరించారు. జడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్‌ రాణి, ఎస్సై శ్రీనివాసరావు, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ నిడమర్తి రామారావు, వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు మడుపల్లి బాలకృష్ణమూర్తి, చిప్పాడ చంద్రశేఖరరావు, హెచ్‌ఎం నిమ్మగడ్డ రవీంద్ర భవాని, పీడీ డీఎన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. 

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : దేశ స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో జాతీయతాసమభావం పెంపొందేలా ప్రతి ఇంటా మువ్వ న్నెల పతాకం ఎగురవేయాలని రాణా వేల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు సుంకర సాంబ శివరాయల్‌, సర్పంచ్‌ పిల్లా అనిత వేర్వేరు కార్యక్రమాల్లో పిలుపునిచ్చారు. కాను మోలు, వీరవల్లిలో ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా సోమవారంహర్‌ ఘర్‌ కా తిరంగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రదర్శన నిర్వహించారు. 

Updated Date - 2022-08-09T06:40:16+05:30 IST