ఉద్యాన వర్సిటీలో సంస్కరణలు చేపడతాం

ABN , First Publish Date - 2020-10-17T11:26:30+05:30 IST

జాతీయ విద్యావిధానం -2020నకు అనుగుణంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన వర్సిటీలో సంస్కరణలు చేపడతామని వైస్‌ ..

ఉద్యాన వర్సిటీలో సంస్కరణలు చేపడతాం

గవర్నర్‌తో వీసీ డాక్టర్‌ జానకిరామ్‌


తాడేపల్లిగూడెం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జాతీయ విద్యావిధానం -2020నకు అనుగుణంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన వర్సిటీలో సంస్కరణలు చేపడతామని వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ టి.జానకిరామ్‌ స్పష్టం చేశారు.  గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతీయ విద్యా విధానంపై చర్చించారు. ఉద్యాన వర్సిటీలో పలు పరిశోధనలు చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా  వీసీ తెలిపారు. రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే పరిశోధనా ఫలితాలు గ్రామాలకు చేరేలా మన గ్రామం-మన విశ్వవిద్యాలయం కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. రిజిస్ర్టార్‌ డాక్టర్‌ కె.గోపాల్‌, డీన్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ డాక్టర్‌ ఎంఎల్‌ఎన్‌ రెడ్డి  పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-17T11:26:30+05:30 IST