వాతావరణ పరిరక్షణకు కంకణ బద్ధులై ఉండాలి

ABN , First Publish Date - 2021-09-17T05:14:57+05:30 IST

జిల్లాలోని విద్యార్థులందరూ వాతావరణ పరిరక్షణకు కంకణ బద్ధులై ఉండాలని విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ విజయకృష్ణారెడ్డి కోరారు.

వాతావరణ పరిరక్షణకు కంకణ బద్ధులై ఉండాలి
మొక్క నాటి, నీరు పోస్తున్న రిజిస్ర్టార్‌ విజయకృష్ణారెడ్డి, రెక్టార్‌ చంద్రయ్య

వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ విజయకృష్ణారెడ్డి 


వెంకటాచలం, సెప్టెంబరు 16 : జిల్లాలోని విద్యార్థులందరూ వాతావరణ పరిరక్షణకు కంకణ బద్ధులై ఉండాలని విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ విజయకృష్ణారెడ్డి కోరారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో గురువారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓజోన్‌ పొర పరిరక్షించడానికి అంతర్జాతీయంగా అనేక చర్యలు చేపట్టారని, తద్వారా కొంతవరకు నష్టం నివారించగలిగారన్నారు. అందరూ కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే వాతావరణ సమతుల్యాన్ని కాపాడవచ్చని తెలిపారు. అనంతరం వీఎస్‌యూ రెక్టార్‌ ఎం.చంద్రయ్య మాట్లాడుతూ వాతావరణంలో సంభవించిన పెను మార్పుల వలన ఓజోన్‌ పొర క్షీణిస్తుందని, తద్వారా అనేక రకాల వ్యాధులు, కేన్సర్‌కు కారణమవుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌   డాక్టర్‌ అల్లం ఉదయ్‌ శంకర్‌, ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌  విజయ తదితరులున్నారు. 


Updated Date - 2021-09-17T05:14:57+05:30 IST