Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 4: పెట్రోల్‌, డీజి ల్‌పై రాష్ట్ర ప్రభుత్వం  వ్యాట్‌ను తగ్గించాలని  భార తీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి గౌడ వాసు, జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ విగ్రహం ఎదుట శనివారం  ఓబీసీ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కళ్లకు నల్లగంతలు కట్టుకొని  నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ధరలను తగ్గించి వాహనాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేస్తోందని,  కేంద్ర ప్రభుత్వానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం  వ్యాట్‌ను తగ్గించాలని అన్నారు.  కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి వేణుమాధవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెల్లి వేణు, శ్రీనివాసయాదవ్‌, రాజం ప్రకాష్‌, పట్టణ అధ్యక్షుడు శ్రీగాధ మైసయ్య, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఠాకూర్‌ రాజ్‌సింగ్‌, పట్టణ ఉపాధ్యక్షుడు ఆదిపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, మ్యాన రాంప్రసాద్‌, దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేకల కమలాకర్‌, జిల్లా కార్యదర్శి గజభీంకార్‌ చందు, చొప్పదండి అంజన్న, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement