Advertisement
Advertisement
Abn logo
Advertisement

డీజిల్‌, పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

నారాయణపేట, డిసెంబరు 4 : డీజిల్‌, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గిం చాలని డిమాండ్‌ చేస్తూ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ధరలు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించక పోవడాన్ని ఖండించారు. ఇప్పటికైనా ధరలను తగ్గించి పేదలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు రఘు రామయ్య, సాయిబన్న, రామకృష్ణ, రఘువీర్‌, కేశవ్‌, వెంకటయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement