Abn logo
Sep 18 2020 @ 12:43PM

బిగ్‌బాస్‌ సీజన్ 4లో వసుంధరా దాస్‌?

Kaakateeya

తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌4కు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అక్టోబర్‌ మొదటివారంలో ఈ షో ప్రారంభం కానుంది. యూనివర్సల్‌స్టార్‌ కమల్‌హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు పాల్గొంటున్నారు. నటి కిరణ్‌ రాథోడ్‌ ఈ షోలో పాల్గొంటుండగా ప్రముఖ సినీ గాయని, నటి వసుంధరా దాస్‌ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. వసుంధరా దాస్‌ అజిత్‌ నటించిన ‘సిటిజన్‌’లో, కమల్‌హాసన్‌ ‘హేరామ్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. వసుంధరాదాస్‌ను ఈ షోలో పాల్గొనాల్సిందిగా విజయ్‌ టీవీ నిర్వాహకులు కోరినట్లు తెలిసింది. త్వరలో ఆమె తన అంగీకారం తెలుపనుందని చెబుతున్నారు.


Advertisement
Advertisement