Abn logo
Oct 16 2021 @ 23:43PM

దిశ పోలిసు స్టేషన్‌ డీఎస్పీగా వాసుదేవన్‌

డీఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆర్‌.వాసుదేవన్‌

ockquote>
కడప(క్రైం), అక్టోబరు, 16 : కడప దిశ పోలీ్‌సస్టేషన్‌ డీఎస్పీగా ఆర్‌.వాసుదేవన్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు.  91 బ్యాచ్‌కు చెం దిన ఈయన ఎస్‌ఐగా అనంతపు రం జిల్లాలో పని చేశారు. సీఐగా 2005లో పదోన్నతి పొంది అనంతపురం జిల్లాతో పాటు తిరుపతి ఇంటె లిజన్స్‌ విభాగంలో విధులు నిర్వహించారు. 2014లో  డీఎస్పీగా పదోన్నతి పొంది కడప మహిళా పోలీ్‌సస్టేషన్‌లో పని  చేశారు. అనంతరం పులివెందుల, రాయచోటి సబ్‌ డివిజన్లలో పని చేసి విజయవాడ మంగళగిరి హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ పై వెళ్లారు. తిరిగి దిశా పోలీ్‌సస్టేషన్‌ డీఎస్పీగా బదిలీ పై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు దాదాపు 210000 మంది దిశా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని మహిళలకు కొండంత అండగా దిశ పోలీ్‌సస్టేషన్‌ ఉంటుందన్నారు.  ముందుగా జిల్లా ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.