మూడుదశాబ్దాల నుంచి ఉత్తమకథలను పాఠకులకు అందిస్తున్న కథాసాహితి సంకలనాల పరంపరలో 31వది అయిన ‘కథ 2020’ ఆవిష్కరణ సభ డిసెంబరు 26 ఆదివారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆడెపు లక్ష్మీపతి అధ్యక్షతన జరుగుతుంది. మధురాంతకం నరేంద్ర ఆవిష్కరిస్తారు, ఎ.వి. రమణమూర్తి సమీక్షిస్తారు. కె. శివారెడ్డి, నర్శిం, గీతా రామస్వామి ఆత్మీయ సందేశాలిస్తారు. సంకలనంలోని కథారచయితలు తమ కథానేపథ్యాన్ని వివరిస్తారు.
వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్
(కథాసాహితి సంపాదకులు)