Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 17 Aug 2022 14:53:42 IST

Varun Tej : తదుపరి చిత్రానికి దర్శకుడు అతడేనా?

twitter-iconwatsapp-iconfb-icon

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varuntej).. ఈ ఏడాది ‘గని (Ghani), ఎఫ్ 3 (F3) ’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వాటిలో ‘గని’ పరాజయాన్ని మూటగట్టుకోగా.. ‘ఎఫ్ 3’ మొదటి భాగం అంత కాకపోయినా.. బాగానే పే చేసింది. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ తదుపరిగా ఏ దర్శకుడితో చేయబోతున్నాడనేది ఆసక్తిగా మారింది. ఇటీవల ‘కార్తికేయ 2’ (Karthikeya 2) తో సూపర్ హిట్ సొంతం చేసుకున్న చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో వరుణ్ తన నెక్స్ట్ మూవీని లాక్ చేసుకున్నాడని వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం ‘కార్తికేయ 2’ చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ అద్భుతమైన స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో దర్శకుడు చందు మాట్లాడుతూ.. తన తదుపరి చిత్రం గీతా ఆర్ట్స్‌లో ఉండనుందని వెల్లడించాడు.

అలాగే.. ‘కార్తికేయ 2’ చిత్రం సక్సెస్ మీట్లో చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా నిర్మించబోతున్నట్టు అల్లు అరవింద్ (Allu Aravind) కన్ఫర్మ్ చేశారు. ఆరు నెలల నుంచి ఈ సినిమా స్ర్కిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు తెలిపారు. దాంతో ఈ సినిమా వరుణ్ తేజ్‌తోనే తెరకెక్కనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. వరుణ్ తేజ్‌తో సినిమా తెరకెక్కించాకా చందు మొండేటి ‘కార్తికేయ 3’(Karthikeya3) సినిమాపై దృష్టి పెట్టొచ్చని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశముంది. 

‘గని’ చిత్రం కోసం తెగ కష్టపడ్డాడు వరుణ్ తేజ్. జిమ్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేసి సిక్స్ ప్యాక్ బాడీని సైతం బిల్డ్ చేశాడు. అయితే పేలవమైన కథాకథనాలతో తెరకెక్కి సినిమా పరాజయం చవిచూసింది. దాంతో వరుణ్ తీవ్రంగా నిరాశ చెందాడు. ఇక ‘ఎఫ్ 3’ చిత్రానికొస్తే ఇది కామెడీ జోనర్ లో తెరకెక్కిన సినిమా, పైగా మెయిన్ క్రెడిట్ వెంకటేశ్ కు వెళ్లిపోయింది. ఈ క్రమంలో తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తగా అడుగులేయ బోతున్నాడు వరుణ్. కథాకథనాల విషయంలో మరింతగా కేర్ తీసుకోబోతున్నట్టు టాక్. దానికి తగ్గట్టుగానే చందు మొండేటి మంచి కథతో వరుణ్ తేజ్ కు బ్లాక్ బస్టర్ హిట్టిస్తాడేమో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement