May 11 2021 @ 12:30PM

దసరాకు వరుణ్ తేజ్ కొత్త సినిమా..?

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ దసరాకు కొత్త సినిమాను ప్రారంభించబోతున్నట్టు తాజాగా వార్త ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 'ఛలో', 'భీష్మ' సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కనున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో కూడా రష్మిక మందన్నను తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో కలిసి 'ఎఫ్ 3', బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న 'గని' సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత వెంకీ కుడుమలతో దర్శకత్వంలో నటించేందుకు వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయని సమాచారం.