Jun 5 2021 @ 16:36PM

'లూసీఫర్' రీమేక్‌లో వరుణ్ తేజ్..?

మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మలయాళ హిట్ సినిమా 'లూసీఫర్' తెలుగు రీమేక్‌లో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కీలక పాత్రలో నటించబోతున్నాడనే హాట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చేస్తున్న మెగాస్టార్ త్వరలో 'లూసీఫర్' రీమేక్‌ను సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్‌, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్. బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ విదేశాల నుంచి ఇండియాకి తిరిగి వచ్చి సీఎం పదవికి పోటీ చేసే పాత్రలో కనిపించనున్నట్టు ఒక వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఇది ఎంతవరకు నిజమన్నది మేకర్స్ ఇంకా స్పందించలేదు. కానీ ఈ వార్త మాత్రం మెగా అభిమానులకి రెట్టింపు ఉత్సాహాన్నిస్తోంది. 'ఆచార్య'లో మెగాస్టార్ - మెగా పవర్ స్టార్ కలిసి నటిస్తుండగా 'లూసీఫర్' తెలుగు రీమేక్‌లో మెగాస్టార్‌తో మెగాప్రిన్స్ కనిపించబోతున్నాడని ప్రచారం చేస్తున్నారు. చూడాలి మరి మెగా అభిమానుల ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో.