Oct 28 2021 @ 03:01AM

కనివిని ఎరుగని గని

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. ఈ సినిమా టైటిల్‌ లిరికల్‌ సాంగ్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ‘దేఖో హిం గని... కనివిని ఎరుగని గని’ అంటూ సాగే ఈ గీతంలో బాక్సర్‌గా వరుణ్‌ కష్టాన్ని చూపించారు. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్‌ కథానాయిక. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో సిద్దు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్‌ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.