Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 22 Jun 2022 09:05:52 IST

Varun Tej: ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడా..?

twitter-iconwatsapp-iconfb-icon

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) యంగ్ డైరెక్టర్ సుజీత్‌ (Sujeeth)కు గ్రీన్ సిగ్న్ల ఇచ్చాడా..? ప్రస్తుతం అవుననే టాక్ వినిపిస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచి వరుణ్ తేజ్ కాస్త డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కంచె, అంతరిక్షం, ఫిదా, గద్దలకొండ గణేష్..ఇలా ఒక్కో సినిమాకు వైవిధ్యం చూపిస్తున్నాడు. అంతేకాదు, వెంకటేశ్‌ (Venkatesh)తో కలిసి ఎఫ్ 2 (F 2), ఎఫ్3 (F 3) లాంటి మల్టీస్టారర్ సినిమాలను చేస్తూ సక్సెస్‌లను అందుకుంటున్నాడు ప్రిన్స్. ఇటీవల రెండు చిత్రాలతో వచ్చాడు.

వాటిలో గని (Ghani) ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందనే విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం వరుణ్ శారీరకంగా చాలా కష్టపడ్డాడు. గని సినిమా కథలో హీరో పాత్ర బాక్సర్ కావడంతో ఆ పాత్రకు తగ్గట్టు మేకోవర్ అవడానికే కొన్ని నెలలు పట్టింది. ఫిట్ బాడీతో బాక్సర్‌గా తయారవడంతో వరుణ్ లుక్ చూసి అందరూ షాకయ్యారు. అయితే, అనూహ్యంగా గని అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫ్లాప్‌గా నిలిచింది. అయినా నెక్స్ట్ సినిమా ఎఫ్ 3 మల్టీస్టారర్ మూవీతో హిట్ అందుకొని బ్యాలెన్స్ చేశాడు.

ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) ఓ సినిమాను రూపొందించబోతున్నాడు. ఆరెంజ్ తర్వాత మళ్ళీ నిర్మాణ రంగంవైపు రాని నాగబాబు (Naga Babu)..ప్రవీణ్ సత్తారు - వరుణ్ తేజ్ సినిమాతో సహ నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే, ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా కూడా ప్రకటించారు. త్వరలో రెగ్యుల్ షూటింగ్ మొదలవబోతోంది. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రన్ రాజా రన్ (Run Raja Raun) సినిమాతో హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్ ఆ తర్వాత సాహో (Sahoo)తో ఏకంగా ప్రభాస్‌ (Prabhas)ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. అయితే, ఈ సినిమా ఆశించిన సక్సెస్‌ను సాధించలేదు. ఆ తర్వాత మెగాస్టార్ సినిమా చేతికి వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. ఇప్పుడు మళ్ళీ మెగా హీరో వరుణ్ తేజ్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వస్తే గానీ తెలియదు.   

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement