Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 23 May 2022 09:10:36 IST

Varun Tej - Praveen Sattaru Combo : సెట్స్‌పైకి వెళ్ళేది అప్పుడేనా?

twitter-iconwatsapp-iconfb-icon

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) గత చిత్రం ‘గని’ (Ghani) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్ 3’ ( F3 ) విడుదలకు సిద్ధంగా ఉంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి ఇండస్ట్రీలో మంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. యస్వీసిసి బ్యానర్ పై బీవీయస్ యన్ ప్రసాద్ (BVSN Prasad) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చ్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది.  ఈ సినిమాకి నాగబాబు (Nagababu) సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ (Mickey j mayor) సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల రెండో వారంలో ప్రారంభం కానుందనే వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం నాగార్జున (Nagarjuna) తో ‘ది ఘోస్ట్’ (The Ghost) అనే యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రవీణ్ సత్తారు ( Praveen Sattaru ). ఇందులో నాగ్ ఎఫ్‌బీఐ (FBI) ఏజెంట్‌గా నటిస్తుండగా.. కథానాయికగా సోనాల్ చౌహాన్ మెరవబోతోంది. అయితే ఈ సినిమా విడుదల కాకుండానే..  వరుణ్ తేజ్ (Varun Tej) సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రవీణ్ సత్తారు. ఈ సినిమా ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తయిన తర్వాతనే ‘ది ఘోస్ట్’ మూవీ విడుదల ఉంటుందని చెబుతున్నారు. ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. అలాగే.. వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ ( F3 ) చిత్రం కూడా కొద్దిరోజుల్లోనే విడుదలవుతుంది. ఆ తర్వాత వరుణ్ .. ప్రవీణ్ చిత్రానికి షిఫ్ట్ అవుతాడని టాక్.   

వరుణ్ తేజ్ ( Varun Tej ) కెరీర్ లోనే  మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం ఇదే కావడం విశేషం. పాన్ ఇండియా మార్కెట్ తగ్గట్టుగానే ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఈ సినిమాను జూన్‌లో ప్రారంభించి ఈ ఏడాది చివరిలో సినిమాను విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాపై మరిన్ని వివరాలు వచ్చే నెల్లో తెలియబోతున్నాయి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International