Abn logo
May 11 2021 @ 18:44PM

వంద ఆక్సిజన్ సిలిండర్లు విరాళం ఇచ్చిన వరుణ్ గాంధీ

పిలిబిత్: కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా దేశం యావత్తూ ప్రాణవాయువు కోసం విలవిల్లాడుతున్న వేళ బీజేపీ నేత, పిలిబిత్ ఎంపీ వరుణ్ గాంధీ పెద్ద మనసు చాటుకున్నారు. 100 పైగా ఆక్సిజన్ సిలిండర్లను జిల్లా అధికారులకు అందజేశారు. ఈ మేరకు వరుణ్ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. కొవిడ్-19తో బాధపడుతున్న ప్రజలకు తోడ్పడేందుకు వీలుగా తన నివాసాన్ని కూడా వినియోగించుకోవచ్చని కూడా ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం పిలిబిత్ ప్రజలకు కరోనాలో సాయపడేలా 100 పెద్ద సిలిండర్లను పంపుతానంటూ హామీ ఇచ్చిన వరుణ్.. తాజాగా తన మాట నిలబెట్టుకున్నారు. ఈ ఆక్సిజన్ సిలిండర్లను తన స్వయం కృషితో, తన సొంత డబ్బును వెచ్చించి ఏర్పాటు చేసినట్టు సదరు ప్రకటనలో ఆయన వెల్లడించారు. పిలిబిత్ జిల్లా ప్రజలు తన కుటుంబమనీ.. కరోనా సంక్షోభంలో వారిని ఆదుకునేందుకు తన శక్తిమేర కృషిచేస్తానని ఈ సందర్భంగా ఎంపీ పేర్కొన్నారు.

జాతీయంమరిన్ని...

Advertisement