May 15 2021 @ 16:51PM

'ఎఫ్ 3'లో ఎఫెక్టివ్‌గా వరుణ్ క్యారెక్టర్‌

'ఎఫ్ 3'లో ఎఫెక్టివ్‌గా వరుణ్ క్యారెక్టర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇంతక ముందు వెంకటేశ్ - వరుణ్ తేజ్‌లతో 'ఎఫ్ 2' తెరకెక్కించి భారీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దీనికి కొనసాగింపుగా 'ఎఫ్ 3' తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ డబుల్ డోస్‌లో ఉండబోతుందని దర్శకుడు ముందు నుంచి చెబుతున్నాడు. ఇందులోనూ వెంకటేశ్ - తమన్నా, వరుణ్ తేజ్ - మెహ్రీన్ జంటగా నటిస్తున్నారు. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తవగా 'ఎఫ్ 2' లో వెంకీ క్యారెక్టర్ కామెడీ పరంగా ఎంత హైలెట్ అయిందో ఇప్పుడు 'ఎఫ్ 3'లో వరుణ్ క్యారెక్టర్ అంతకు రెట్టింపు హైలెట్ అయ్యేలా చూపించబోతున్నాడట. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. 'ఎఫ్ 2' వంద 100 కోట్ల క్లబ్‌లో చేరిన కారణంగా సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.