May 16 2021 @ 10:20AM

మరోసారి ‘ఫిదా’ చేయడానికి జోడీ కడతారా?

హీరో హీరోయిన్ కాంబినేష‌న్‌లో ఓ బ్లాక్‌బస్ట‌ర్ ప‌డితే, ఆ పెయిర్‌ను అంద‌రూ హిట్ పెయిర్ అంటార‌నే సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌లో అలాంటి హిట్ పెయిర్స్ చాలానే ఉన్నాయి. వాటిలో వ‌రుణ్‌తేజ్‌, సాయిప‌ల్ల‌వి జోడీ ఒక‌టి. వీరిద్ద‌రూ క‌లిసి శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ‘ఫిదా’ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమా విడుద‌లై మూడేళ్లైంది. త‌ర్వాత ఈ జోడి సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌లేదు. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు వ‌రుణ్‌తేజ్‌, సాయిప‌ల్ల‌వి మ‌రోసారి ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతున్నార‌ట‌. వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌స్తుతం ‘గ‌ని, ఎఫ్‌3’ సినిమాల‌తో బిజీగా ఉన్న వ‌రుణ్‌తేజ్ త‌దుప‌రి చిత్రాన్ని వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను సైలెంట్‌గా చేస్తున్నార‌ట‌. ఈ సినిమాలో వ‌రుణ్ స‌ర‌స‌న సాయిప‌ల్ల‌విని న‌టింప చేయ‌డానికి చ‌ర్చ‌లు చేస్తున్నార‌ట‌. అంతా ఓకే అయితే మ‌రోసారి ఫిదా జోడి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం ప‌క్కా అని సినీ వ‌ర్గాల టాక్‌.