Oct 20 2021 @ 14:58PM

‘వరుడు కావలెను’ VS ‘రొమాంటిక్’

సాధారణంగా ఒకే రిలీజ్ డేట్లో రెండు సినిమాలు విడుదలవడం జరగదు. రెండు సినిమాల మీద కలెక్షన్స్ ప్రభావం పడుతుంది. అందుకే ఇప్పటి వరకూ  రెండు పెద్ద హీరోల సినిమాలు కానీ, రెండు పెద్ద సంస్థల నుంచి సినిమాలు కానీ ఒకే రోజున విడుదలవలేదు. తప్పదు అనుకుంటే ఒకేరోజున ఆ సినిమాలకి పోటీ తప్పదు. టాలీవుడ్ లో ఈ అక్టోబర్ 29న ఒకేసారి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. యంగ్ హీరో నాగశౌర్య ‘వరుడు కావలెను’, టీనేజ్ హీరో ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ చిత్రాలు బాక్సాఫీస్ పోరు కు రెడీ అవుతున్నాయి.  నాగశౌర్య ‘వరుడు కావలెను’ సినిమాని సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా, లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. రీతూవర్మ కథానాయికగా నటిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీపై  భారీ అంచనాలున్నాయి. ఇదివరకు విడుదలైన ఈ సినిమాలోని పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రొమాంటిక్ విషయానికొస్తే పూరీ జగన్నాథ్, చార్మీ  సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కగా.. అనిల్ పాడూరి దర్శకత్వం వహించారు. మాస్ అండ్ యాక్షన్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల విడుదలైన రొమాంటిక్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి వీటిలో ఏ సినిమాది పైచేయి అవుతుందో చూడాలి.