కాలేజీ నిర్వాహకులతో జేఎన్‌టీయూ ఆన్‌లైన్‌ అకడమిక్‌ రివ్యూ మీటింగ్‌

ABN , First Publish Date - 2020-10-30T10:10:53+05:30 IST

జేఎన్‌టీయూ పరిధిలో ఉన్న అన్ని అటానమస్‌, నాన్‌ అటానమస్‌ కాలేజీ నిర్వాహకులతో ఆన్‌లైన్‌లో అకడమిక్‌ రివ్యూ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌ ..

కాలేజీ నిర్వాహకులతో   జేఎన్‌టీయూ ఆన్‌లైన్‌ అకడమిక్‌ రివ్యూ మీటింగ్‌

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ పరిధిలో ఉన్న అన్ని అటానమస్‌, నాన్‌ అటానమస్‌ కాలేజీ నిర్వాహకులతో ఆన్‌లైన్‌లో అకడమిక్‌ రివ్యూ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌ హుస్సేన్‌ తెలిపారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలకు చెందిన నాన్‌ అటానమస్‌ కాలేజీల నిర్వాహకులతో నవంబర్‌ 2న, మిగిలిన అన్ని జిల్లాల్లో ఉన్న కాలేజీ నిర్వాహకులతో నవంబర్‌ 3న, అన్ని అటానమస్‌ కాలేజీల నిర్వాహకులతో నవంబర్‌ 4న అకడమిక్‌ రివ్యూ మీటింగ్‌లు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతున్న విద్యార్థుల శాతం, పూర్తయిన సిలబస్‌, హాజరుకాని విద్యార్థులకు నిర్వహించిన ప్రత్యేక తరగతులు, యాంటీ ర్యాగింగ్‌ యాక్టివిటీస్‌, వర్చువల్‌ లాబ్‌ క్లాస్‌ రూమ్‌ కండిషన్‌ అంశాలపై చర్చిస్తామని తెలిపారు.

Updated Date - 2020-10-30T10:10:53+05:30 IST