వివేకా హత్య కేసులో అన్ని వేళ్లు ఆయన వైపే ..: వర్లరామయ్య

ABN , First Publish Date - 2021-04-03T22:42:33+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి‌ బాబాయ్‌ వివేకా హత్య కేసులో అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయని తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య వ్యాఖ్యానించారు.

వివేకా హత్య కేసులో అన్ని వేళ్లు ఆయన వైపే ..: వర్లరామయ్య

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి‌ బాబాయ్‌ వివేకా హత్య కేసులో అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయని  తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకోట రహస్యాన్ని బద్దలు చేయాల్సింది ఆయనేనని చెప్పారు. ఢిల్లీలో సునీత ప్రెస్‌మీట్‌పై ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆమె ప్రశ్నలన్నీ సీఎంనే కార్నర్ చేస్తున్నాయని తెలిపారు.  తన కేసులు, బాబాయ్‌ హత్య కేసు కోసమే సీఎం జగన్‌.. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షాని కలిశాడని వర్లరామయ్య  పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-03T22:42:33+05:30 IST