అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ అక్రమాలు బయటపెడతాడనే భయంతోనే.. సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఘటనపై వాస్తవాలను డీజీపీ బయటకు తీయాలన్నారు. అనంతబాబు గుట్టును బయటపెట్టాలన్నారు. తక్షణమే అనంతబాబును అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేవరకు పోరాడుతామని వర్ల రామయ్య ప్రకటించారు.
ఇవి కూడా చదవండి