అనంతబాబుకు వైపు మొగ్గడం దళిత వ్యతిరేక చర్యే: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2022-06-21T02:01:41+05:30 IST

దళిత యువకుడిని దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును బెయిల్‌పై బయటకు తీసుకురావాలని ప్రభుత్వం నానా తంటాలు పడుతుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని

అనంతబాబుకు వైపు మొగ్గడం దళిత వ్యతిరేక చర్యే: వర్ల రామయ్య

విజయవాడ: దళిత యువకుడిని దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును బెయిల్‌పై బయటకు తీసుకురావాలని ప్రభుత్వం నానా తంటాలు పడుతుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ‘‘దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన మీరు ఈ వర్గాలను విస్మరించి, అనంతబాబు వైపు మొగ్గడం దళిత వ్యతిరేక చర్యే. ఇప్పటికైనా దళితులకు న్యాయం చేయండి’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను పోలీసులు ఎ-1 నిందితుడిగా ప్రకటించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో అనంతబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

Updated Date - 2022-06-21T02:01:41+05:30 IST