Abn logo
Jul 27 2021 @ 15:22PM

డీజీపీకి లేఖ రాసిన వర్ల రామయ్య

అమరావతి: డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. పోలీసులు ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారని, ప్రతిపక్షాలను హౌస్‌ అరెస్టులు చేయడం బావ్యమా? అని లేఖలో ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులును ఎందుకు నిర్బంధించారని, చెత్త పన్ను విధించిన ప్రభుత్వంపై నిరసన తెలియచేయడం నేరమా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. చెత్తపై పన్నుకు వ్యతిరేకంగా ఆంజనేయులు నిరసన చేపట్టారు. ఆంజనేయులును అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.