ఏపీలో విషసంస్కృతి నాటుతారా?: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2022-01-18T22:37:09+05:30 IST

సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్‌లో విషసంస్కృతి నాటుతారా? అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు.

ఏపీలో విషసంస్కృతి నాటుతారా?: వర్ల రామయ్య

అమరావతి: సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్‌లో విషసంస్కృతి నాటుతారా? అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య  ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్యాసినోలు, క్యాబరే డ్యాన్సులతో రాష్ట్రం పరువు తీస్తారా అని మండిపడ్డారు.నాడు ఎన్టీఆర్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పారు. నేడు జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగు సంస్కృతిపై దాడి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారి సంస్కృతి, సంప్రాదాయాలపై దాడిని తెలుగుప్రజలంతా ఎదుర్కోవాలన్నారు.గుడివాడలో క్యాసినో విషం ముఖ్యమంత్రి, డీజీపీలకు తెలియదా? అని నిలదీశారు. సంక్రాంతి సందర్భంగా రూ.250కోట్లరూపాయలు చేతులు మారాయని మండిపడ్డారు. అసాంఘిక కార్యకలాపాలు కళ్లెదుట జరుగుతున్నా బాధ్యులపై చర్య తీసుకోలేని డీజీపీ పరిస్థితి చూస్తే జాలేస్తోందన్నారు. పోలీసు వ్యవస్థను అధఃపాతాళానికి దిగజార్చిన ఘనత డీజీపీ సవాంగ్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రి, డీజీపీ అండతోనే తెలుగు సంస్కృతిపై దాడి జరిగినట్లు భావిస్తామని వర్ల రామయ్య అన్నారు. 

Updated Date - 2022-01-18T22:37:09+05:30 IST