అమరావతి : ఏపీ మంత్రి నాగార్జున ఉచ్చ నీచాలు తెలియకుండా మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. తమ నాయకుడు చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్నాడన్నారు. రాష్త్ర ప్రజలు సీఎం జగన్‌కు, వైసీపీకి త్వరలోనే స్వస్తి పలుకుతారన్నారు. మీ పార్టీ సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి లాంటిదని ఎద్దేవా చేశారు. అందుకు మీ బస్సు యాత్రకు వస్తున్న స్పందనే నిదర్శనమన్నారు. వైసీపీ నేతలు సభ్యత వీడి మాట్లాడవద్దని వర్ల రామయ్య హితవు పలికారు.