హైకోర్టులో తీర్పుతో సీఎంకు వణుకు: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2021-01-21T22:43:36+05:30 IST

హైకోర్టులో తీర్పుతో సీఎం జగన్‌కు వణుకు మొదలైందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో

హైకోర్టులో తీర్పుతో సీఎంకు వణుకు: వర్ల రామయ్య

విజయవాడ: హైకోర్టులో తీర్పుతో సీఎం జగన్‌కు వణుకు మొదలైందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి సీఎం జగన్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును స్వాగతించి, ఎన్నికలకు సిద్ధమన్న డిప్యూటీ సీఎం అంజాద్‌బాషాకు సీఎం బాధ్యతలు అప్పజెప్పాలని కోరారు. సవాంగ్ డీజీపీగా ఉంటే ఎన్నికలు సజావుగా సాగవని పేర్కొన్నారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను ఎస్ఈసీ తక్షణమే బదిలీ చేయాలని వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-01-21T22:43:36+05:30 IST