ఈ వారం వివిధ కార్యక్రమాలు 30-05-2022

ABN , First Publish Date - 2022-05-30T06:00:16+05:30 IST

‘రాయ రత్నమంజూష’ ఆవిష్కరణ శ్రీనివాస శాస్త్రి స్మారక పురస్కారం సహృదయానుబంధ పురస్కారం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 30-05-2022

‘రాయ రత్నమంజూష’ ఆవిష్కరణ

బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌ ముద్రించిన ‘రాయరత్న మంజూష’ గ్రంథం ఆవిష్కరణ సభ జూన్‌ 5 సా.6గం.లకు గుంటూరు బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి వైశ్య హాస్టల్‌లో జరుగుతుంది. సభలో వాడ్రేవు చినవీరభద్రుడు, మోదుగుల రవికృష్ణ, గార రంగనాథం తదితరులు పాల్గొంటారు.

బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌


శ్రీనివాస శాస్త్రి స్మారక పురస్కారం

పురాణం శ్రీనివాస శాస్త్రి (శ్రీశా) జయంతి సందర్భంగా జూన్‌ 5 ఉ.10గం.లకు ఆయన కథా సంకలనం ఆవిష్కరణ, ఆయన పేరిట నెలకొల్పిన స్మారక పురస్కార ప్రదానం కార్యక్రమాలు పైడి జైరాజ్‌ ఆడిటోరియం, రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతాయి. స్మారక పురస్కారాన్ని ‘కేరాఫ్‌ కూచిమంచి అగ్రహారం’ పుస్తక రచయిత ముక్కామల చక్రధర్‌ స్వీకరిస్తారు. దీనితో పాటు, కోకిలమ్‌ సాహితీ సాంస్కృతిక వేదిక తరఫున చిత్రకారుడు బ్నిం కు పురస్కార ప్రదానం జరుగుతుంది. సభలో కె.శివారెడ్డి, తనికెళ్ళ భరణి, ఇంద్రగంటి జానకీ బాల, ఇంద్రగంటి మోహనకృష్ణ, వి. రాజారామ మోహన రావు తదితరులు పాల్గొంటారు. 

పురాణం శ్రీనివాస శాస్త్రి కుటుంబం


సహృదయానుబంధ పురస్కారం

కీ.శే. రాళ్ళబండి కవితాప్రసాద్‌ స్మృత్యంకంగా సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ, వరంగల్లు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇస్తున్న పురస్కారాన్ని దీర్ఘాసి విజయకుమార్‌ స్వీకరిస్తారు. వివరాలకు: 9866610429

ఎన్‌.వి.ఎన్‌.చారి


మయూఖ వచన కవితల పోటీ ఫలితాలు

మయూఖ, కవితా వేదిక (కెనడా) సంయుక్తంగా నిర్వ హించిన వచన కవితల పోటీ ఫలితాలు: ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపికైనవారు వరు సగా- పెళ్లూరు సునీల్‌ (‘ఆట’), జాబేర్‌ పాషా (‘శ్వేత వర్ణ యమపాశం’), చొక్కాపు లక్ష్మణ్‌ నాయుడు (‘రక్ష రేఖలు’). త్వరలో హైదరాబాద్‌లో బహుమతుల ప్రదానం జరుగుతుంది.

కొండపల్లి నీహారిణి


Updated Date - 2022-05-30T06:00:16+05:30 IST