ఈ వారం వివిధ కార్యక్రమాలు 26-06-2022

ABN , First Publish Date - 2022-06-27T10:18:56+05:30 IST

సినారే సాహిత్య పురస్కారం సింగిల్‌ పేజీ కథల పోటీలు తెలంగాణ ప్రాచీన కావ్యాలపై సదస్సు...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 26-06-2022

సినారే సాహిత్య పురస్కారం

సాహితీ గౌతమి, కరీంనగర్‌ జ్ఞానపీఠ పుర స్కార గ్రహీత సి. నారాయణ రెడ్డి పేరు మీద ప్రతి ఏటా ఇస్తున్న తెలుగు రాష్ర్టాల స్థాయి సినారే పురస్కారాన్ని 2021 సంవ త్సరానికి గాను అన్నవరం దేవేందర్‌ ‘గవాయి’ కవితా సంపుటికి స్వీకరిస్తారు. అన్నవరం దేవేందర్‌ కరీంనగర్‌ జిల్లాకు చెందిన కవి. ఇప్పటికి పదిహేను పుస్తకాలు వెలువరించారు. పురస్కార ప్రదానోత్సవం సభ త్వరలో ఉంటుంది.

ఎడవెల్లి విజయేంద్ర రెడ్డి


సింగిల్‌ పేజీ కథల పోటీలు 

కోపూరి శ్రీనివాస్‌ స్మారక సింగిల్‌ పేజీ కథల పోటీకి రాతలో ఎ4కు మించకుండా (డిటిపి అరపేజీ మించకుండా) రచనలను జూలై 15 లోగా పంపాల్సిన చిరునామా: ‘రమ్యభారతి’ పోస్ట్‌బాక్స్‌ నెంబర్‌.5, విజయ వాడ-520001. మరిన్ని వివరాలకు, చలపాక ప్రకాష్‌ ఫోన్‌: 9247475975

రమ్యభారతి


తెలంగాణ ప్రాచీన కావ్యాలపై సదస్సు

సాహిత్య అకాడమీ - తెలుగు అధ్యన శాఖ, తెలంగాణ విశ్వవిద్యాలయం, డిచ్‌పల్లి, నిజామాబాద్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘తెలంగాణ ప్రాచీన కావ్యాలు’ అంశంపై జాతీయ సదస్సు జులై 1 ఉ.9.30 నుంచి పై చిరు నామాలో జరుగుతుంది. రోజంతా జరిగే సమావేశాల్లో ప్రాచీన కావ్యాలపై ప్రసంగాలు, పత్ర సమర్పణలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో కరిమిండ్ల లావణ్య, డి. రవీందర్‌, కె. శివారెడ్డి, శ్రీరంగాచార్య, గుమ్మన్నగారి బాల శ్రీనివాస మూర్తి, వి. త్రివేణి, పి. కనకయ్య, అయాచితం నటేశ్వరశర్మ తదితరులు పాల్గొంటారు. 

సాహిత్య అకాడెమీ


మహిళా రచయితల కథా సంపుటాలకు ఆహ్వానం

విమలాశాంతి సాహిత్య కథాపురస్కారం-2022ను మహి ళలకు ఇవ్వాలనుకున్నాం. మహిళా కథా రచయితలు జూలై 1, 2017 నుంచి జూన్‌ 30, 2022 మధ్య కాలంలో ప్రచురితమైన తమ కథాసంపుటాలను 4 కాపీల చొప్పున ఆగస్ట్‌ 15, 2022 లోపు పంపాలి. చిరునామా: శాంతి నారాయణ, 202, ఎస్‌.ఎస్‌.అపార్ట్మెంట్‌, మారుతీ నగర్‌, అనంతపురం. ఫోన్‌:8074974547.

శాంతి నారాయణ


వచన కవితల పోటీ

గుంటూరుకు చెందిన ‘బండి కల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్‌’ నిర్వహిస్తున్న 6వ జాతీయ స్థాయి వచన కవితల పోటీకి కవితల్ని ఆహ్వానిస్తున్నాం.  నిడివి 30 పంక్తులు మించ కుండా ఒక్కొక్కరూ రెండు కవితలు పంపవచ్చు. హామీ పత్రంపై మాత్రమే వివరాలు రాయాలి. కవితలను జులై 30లోపు చిరునామా: బండి కల్లు జమదగ్ని, ప్లాట్‌ నెం. 402, హిమజ టవర్స్‌, 3/10 బ్రాడీపేట, గుంటూరు-522 002కు పంపాలి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమ తులు వరుసగా: రూ.2500, రూ.2000, రూ.1500. నాలుగు ప్రోత్సాహక బహుమతులు రూ.750. వివరాలకు ఫోన్‌: 98482 64742.

బండికల్లు జమదగ్ని

Updated Date - 2022-06-27T10:18:56+05:30 IST