ఈ వారం వివిధ కార్యక్రమాలు 23-05-2022

ABN , First Publish Date - 2022-05-23T05:45:57+05:30 IST

వారణాసిపై పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం ఆం.ప్ర. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌తో ముఖాముఖి ఖమ్మం ఈస్థటిక్స్‌ పురస్కారాలు..

ఈ వారం వివిధ కార్యక్రమాలు 23-05-2022

వారణాసిపై పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం

భారతీయ భాషల సాహిత్యాలలో కవులు వారణాసిని ఏ విధంగా ప్రస్తావించారో ఆ అంశాల గురించి తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషలలో ఐదారు పేజీలకు మించ కుండా ఉపయుక్త గ్రంథసూచితో పరిశోధన వ్యాసాన్ని జూన్‌ 23లోపు ఈమెయిల్‌:kavikula padanyasivaranasi@gmail.comకు పంపాలి. ఈ వ్యాసాలను ‘కవికుల పదన్యాసి వారణాసి’ పేరిట పుస్తకంగా తెస్తాము. వివరాలకు: 9848707978.  

శ్రీవైష్ణవ వేణుగోపాల్‌


ఆం.ప్ర. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌తో ముఖాముఖి

ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావుతో ముఖాముఖి మే 29 ఉదయం ఠాగూర్‌ స్మారక గ్రంథా లయం విజయవాడలో జరుగుతుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల రచయితలు, కవులు, ప్రచురణకర్తలు తమ సందేహాలను, సలహాలూ సూచనలను గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ దృష్టికి తీసుకువెళ్లవచ్చు. పాల్గొనదలిచేవారు పేర్లను 9247475975 నెంబరులో నమోదు చేసుకోవాలి.  

చలపాక ప్రకాష్‌


ఖమ్మం ఈస్థటిక్స్‌ పురస్కారాలు

ఖమ్మం ఈస్థటిక్స్‌ పేరిట ప్రతి ఏటా ఒక ఉత్తమ కవితా సంపుటికి, మూడు ఉత్తమ కథలకు పురస్కారాలు ఇవ్వ నున్నాం. మూడు ఉత్తమ కథలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ పురస్కారాలతోపాటు, మరో తొమ్మిది కథలను ఎంపిక చేసి పన్నెండు కథలతో పుస్తకం అచ్చువేస్తాం. మూడు కథలకు వరుసగా రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేలు, ఉత్తమ కవితా సంపుటికి రూ.40వేల నగదు బహుమతి ఉంటుంది. ఏప్రిల్‌ 2021-ఏప్రిల్‌ 2022ల మధ్య ముద్రితమైన కవితాసంపుటులు, ఈ పురస్కారం కోసం మాత్రమే రాసిన కథలు నాలుగు ప్రతులను ఆగస్ట్‌ 31లోపు చిరునామా: ఖమ్మం ఈస్థటిక్స్‌ సాహిత్య పురస్కారాలు, 11-2-51, బాలాజీ నగర్‌, ఖమ్మం- 507 001. ఫోన్‌ 9849114369కు పంపాలి.   

రావులపాటి సీతారాం


భరత్‌ భూషణ్‌ స్మారక సంచిక

జనవరి 31న క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ కన్ను మూసిన ఛాయాచిత్రకారులు గుడిమళ్ళ భరత్‌ భూషణ్‌ బతుకమ్మ పండుగ చిత్రాలకు పెట్టింది పేరు. వారి స్మరణలో ‘నిలువెత్తు బతుకమ్మ’ పేరిట ఒక విశేష సంచిక తేవాలని బి. నరసింగరావు నడుంకట్టారు. ‘చిత్రలేఖ’ ప్రచురణల తరపున వారు వెలువరించే ఈ సంచికకు- భరత్‌ భూషణ్‌ జీవితం, కళ, దృక్పథం, విశిష్టత, అతడి రచనలు, ప్రదర్శనలు, ఈస్తటిక్స్‌, స్నేహశీలత గురించి, అలాగే-వారితో మీకున్న సాన్నిహిత్యం గురించి, వారు అనారోగ్యంతో పోరాడిన విధానం గురించి వ్యాసాలను జూన్‌ 15లోగా ఈమెయిల్‌: tribute2bha rathbhushan@gmail.comకు పంపాలి. వివరాలకు - 9948077893.

కందుకూరి రమేష్‌ బాబు


నవలల పోటీ

జాగృతి వారపత్రిక ఆధ్వర్యంలో ఎం.డి.వై. రామమూర్తి స్మారక ‘నవలల పోటీ- 2022’కి రచయితలను ఆహ్వాని స్తున్నాం. ప్రథమ, ద్వితీయ బహుమ తులు వరుసగా: రూ.25వేలు, రూ.20 వేలు. భారతీయ జీవన విధానా నికి అద్దం పట్టే ఇతివృత్తంతో, నవలను 125-150 పేజీలకు (ఎ4, 15 పాయిం ట్‌) మించకుండా జూన్‌ 10లోగా చిరునామా: 3-4-228/4/1, జాగృతి భవన్‌, లిగంపల్లి, కాచిగూడ, హైదరా బాద్‌- 500027కు పంపాలి. వివరా లకు: 9959991304. 

హరీష్‌


‘ఆజిరి’ సాహిత్య వ్యాస సంపుటి

రాజాం రచయితల ఏడవ వార్షికో త్సవం మే 29 ఉ.9.30గం.లకు రాజాం విద్యానికేతన్‌ పాఠశాలలో జరుగు తుంది. సభలో పిల్లా తిరుపతి రావు రాసిన ‘ఆజిరి’ సాహిత్య వ్యాస సంపు టి విడుదలవుతుంది. సభలో గార రంగనాథం, పాకలపాటి రఘు వర్మ, జి. లక్ష్మీనరసయ్య, అట్టాడ అప్పల నాయుడు తదితరులు పాల్గొంటారు.

రాజాం రచయితల వేదిక


కథలు, కవితల పోటీలు

‘వురిమళ్ల ఫౌండేషన్‌ - అక్షరాల తోవ’ సంయుక్తంగా కథలు కవితల పోటీ నిర్వహిస్తున్నారు. ‘వురిమళ్ల శ్రీరాములు’ స్మారక కథల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా: రూ.3వేలు, రూ.2వేలు, రూ.1000. ‘వురిమళ్ల పద్మజ’ స్మారక కవితల పోటీలో: ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.2వేలు, రూ.1500, రూ.1000. రెండు విభాగాల్లో రెండు కన్సొలేషన్‌ బహుమతులు రూ.500 చొప్పున. రచనలు జూన్‌ 20లోగా చిరునామా: భోగోజు ఉపేందర్‌ రావు, ఇ.నెం.11-10-694/5, బురహాన్‌ పురం, ఖమ్మం- 507001, ఫోన్‌: 94947 73969కు పంపాలి.

వురిమళ్ల సునంద 


Updated Date - 2022-05-23T05:45:57+05:30 IST