Abn logo
Jul 14 2020 @ 07:23AM

వరవరరావు జేజే ఆసుపత్రికి తరలింపు

ముంబై (మహారాష్ట్ర) : మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను సోమవారం రాత్రి నవీముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. గతంలో వరవరరావును జేజే ఆసుపత్రిలో చేర్చినా అతను పూర్తిగా కోలుకోకుండానే డిశ్చార్జ్ చేశారు. వరవరరావు పూర్తిగా కోలుకునే వరకూ ఆసుపత్రిలోనే ఉంచాలని తెలంగాణ ఫోరం కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ చేసిన వినతిపై స్పందించిన మహారాష్ట్ర అధికారులు అతన్ని జేజే ఆసుపత్రికి తరలించారు. గతంలో జూన్ 1వతేదీన జేజే ఆసుపత్రి నుంచి పూర్తిగా కోలుకోకుండానే డిశ్చార్జ్ చేశారు. జైల్లో మరోసారి వరవరరావు ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని తెలంగాణ ఫోరం, అతని కుటుంబసభ్యులు చేసిన వినతితో మరోసారి జేజే ఆసుపత్రిలో చేర్చారు.

Advertisement
Advertisement
Advertisement