తమిళ దళపతి విజయ్.. (Vijay) వంశీపైడిపల్లి (Vamshy Paidipalli) దర్శకత్వంలో నటిస్తోన్న డైరెక్ట్ తెలుగు సినిమా ‘వారసుడు’ (Varasudu) . తమిళంలో ‘వారిసు’ (Varisu) పేరుతో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు (Dil Raju) నిర్మి్స్తున్నారు. రష్మి్కా మందణ్ణ (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తుండగా.. ప్రభు, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కిక్ శ్యామ్, యోగిబాబు, సంయుక్త తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ‘ది బాస్ రిటర్న్స్’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమా కథాంశం గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇది ఫ్రెంచ్ సూపర్ హిట్ మూవీ ‘లార్గోవించ్’ (Largovinch) ఆధారంగా తెరకెక్కుతోందట. దాంతో ఈ విషయంలో విజయ్ అభిమానులు ఆందోళ చెందుతున్నారు. దానికి కారణం ఇప్పటి వరకూ ఆ సినిమా స్ఫూర్తితో వచ్చిన సినిమాలేవీ సక్సెస్ సాధించలేదు.
తెలుగులో ఆ సినిమా ప్రేరణతో పవన్ కళ్యాణ్ (Pawankalyan) అజ్ఞాతవాసి (Ajnyathavasi) , ప్రభాస్ (Prabas) ‘సాహో’ (Saho) చిత్రాలు వచ్చాయి. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న ‘గాడ్‌ఫాదర్’ (Godfather) చిత్రం కూడా ఇంచుమించు అదే స్టోరీ లైన్ తో రూపొందుతోంది. ‘లార్గోవించ్’ కథాంశంలో కొత్తగా ఏం కనిపిస్తోందో కానీ.. ఆల్రెడీ ఒక సినిమా వచ్చినప్పటికీ.. మరో సినిమా తీయడానికి ఎవరో ఒక దర్శకుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వంశీ పైడిపల్లి (Vamshy Paidipalli) కూడా ‘లార్గోవించ్’ ను సరికొత్త కోణంలో ఆవిష్కరించనున్నాడని తెలుస్తోంది.
ఒక ఇంటి పెద్ద దిక్కు అనూహ్యంగా హత్యచేయబడి, అతడి కుటుంబం కష్టాల పాలయితే.. వారిని ఆ పరిస్థితులనుంచి తప్పించడానికి, ఆయన్ని చంపినవారిని కనిపెట్టడానికి .. అసలైన వారసుడు రంగంలోకి దిగడమే ‘లార్గోవించ్’ కథాంశం. దానికి తగ్గట్టుగానే వంశీపైడిపల్లి విజయ్ తో తసే చిత్రానికి ‘వారసుడు’ అనే టైటిల్ ఖాయం చేశాడు. అయితే అదే ‘లార్గోవించ్’ కథాంశాన్ని పొలిటికల్ యాంగిల్ లో తెరకెక్కించిన మోహన్ లాల్ (Mohanlal) ‘లూసిఫర్’ (Lucifer), మహేశ్ బాబు (Mahesh babu) ‘భరత్ అనే నేను’ (Bharath ane nenu) సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్ హిట్టవడం విశేషం. మరి వారసుడు చిత్రంలో ఏమైనా పొలిటికల్ యాంగిల్ ఉంటుందేమో చూడాలి.