బాధ్యతలు చేపడుతున్న వరప్రసాద్
లక్కిరెడ్డిపల్లె, మే 26: లక్కిరెడ్డిపల్లె సీఐగా వరప్రసాద్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ రాజు పులివెందులకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని నాటుసారా, ఇసుక అక్రమాలు అరికడతామన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు.