విద్యాభివృద్ధికి వరం అమ్మఒడి పథకం

ABN , First Publish Date - 2022-06-28T05:15:44+05:30 IST

గ్రామీణ ప్రాంత పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అమ్మఒడి పథకం వరం లాంటిదని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అన్నారు.

విద్యాభివృద్ధికి వరం అమ్మఒడి పథకం
మెగా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌, జేసీ తదితరులు

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి టౌన్‌, జూన్‌ 27: గ్రామీణ ప్రాంత పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అమ్మఒడి పథకం వరం లాంటిదని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అన్నారు. సోమవారం రాయచోటి పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణంలో జరిగిన అమ్మఒడి మూడో విడత పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లల చదువులకు పేదరికం అడ్డంకి కాకుండా, సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని వరుసగా మూడో ఏడాది ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అనంతరం అమ్మఒడి ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సందేశాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీక్షించారు. అమ్మఒడి పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా లక్షా 57 వేల 292 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.235 కోట్ల 93 లక్షల 80 వేలు ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, జిల్లా విద్యాశాఖాధికారి రాఘవరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, ఎంపీపీ పల్లపు రాజమ్మ, ఎంపీడీవో మల్‌రెడ్డి, ఎంఈవో వెంకటే్‌షనాయక్‌, ఏపీఐఐసీ డైరెక్టర్‌ శ్రీనివాసులరెడ్డి, సీఆర్‌పీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T05:15:44+05:30 IST