'క్రాక్' సినిమాలో ‘జయమ్మ’గా అద్భుతమైన నటనతో విమర్శకుల, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్.. రేంజ్ ఇప్పుడు మారిపోతోంది. ఆ సినిమా తర్వాత వచ్చిన 'నాంది' చిత్రంలో కూడా ఆమె నటనకు ప్రేక్షకులు ముగ్ధులైన విషయం తెలిసిందే. ఇప్పుడిదే ఊపులో ఆమెతో టాలీవుడ్లో సినిమాలు రూపొందించేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు మొదలెట్టారు. అందులో భాగంగానే.. ఆమె పుట్టినరోజు (మార్చి 5) సందర్భంగా.. ఆమె ప్రధాన పాత్రలో చేయబోతోన్న ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఆమె నాయికగా డార్లింగ్ స్వామి డైరెక్షన్లో హవీష్ ప్రొడక్షన్లో.. ఓ హారర్ ఎంటర్టైనర్కు రూపకల్పన చేయబోతున్నారు.
'క్రాక్', 'నాంది' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను తన నటనతో అమితంగా ఆకట్టుకున్న విలక్షణ తారగా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్ నాయికగా.. హవీష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కాంచన కోనేరు ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోనేరు సత్యనారాయణ సమర్పిస్తున్న ఈ చిత్రానికి డార్లింగ్ స్వామి దర్శకుడు. వరలక్ష్మీ శరత్‌కుమార్ బర్త్‌డేని పురస్కరించుకొని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు. హారర్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందే ఈ సినిమాలో వరలక్ష్మి ఓ విలక్షణ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. మురళీకృష్ణ కొడాలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించే ఈ చిత్రానికి గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, అమర్ రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేయనున్నారు.