Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 11 Aug 2022 20:09:29 IST

Om Sri Kankadurga: దేవతగా వరలక్ష్మి శరత్ కుమార్.. మూవీ మొదలైంది

twitter-iconwatsapp-iconfb-icon

నెక్స్ జెన్ పిక్చర్స్ పతాకంపై లంక ఫణిధర్ సమర్పణలో సుమంత్ సైలేంద్ర (Sumanth Sailendra), మేఘా ఆకాష్ (Megha Akash) జంటగా.. లంకా శశిధర్ (Lankaa Shasidhar) స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న చిత్రం ‘ఓం శ్రీ కనకదుర్గ’ (Om Sri Kankadurga). ఈ చిత్రం పూజా కార్యక్రమాలను గురువారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవ సన్నిదానంలో మేకర్స్ జరిపారు. ఈ చిత్రంలో గాడెస్ కనకదుర్గగా వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) నటిస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాత సైలేంద్ర బాబు స్క్రిప్ట్ అందించగా.. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత అంబికా కృష్ణ.. తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. నిర్మాత డి.యస్. రావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా.., డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్  కాశీ విశ్వనాథ్ గౌరవ దర్శకత్వం వహించారు.


అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) మాట్లాడుతూ.. ‘‘లంక శివశంకర్ ప్రసాద్ ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. చాలా ముఖ్యమైన పాత్రను ఇందులో చేస్తున్నాను. మంచి టైటిల్‌తో, మంచి మనసున్న మనుషులు నిర్మిస్తున్న ఈ చిత్రం.. యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’’ అన్నారు. ‘‘అమ్మ వారి సినిమాను కమర్షియల్ వేలో తీస్తున్నామని నాకు డెమో చూయించారు. చూడగానే నచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్‌కు రిఫర్ చేయగా.. తనకి కూడా నచ్చడం చాలా సంతోషం. ‘బ్రాండ్ బాబు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ సైలేంద్రకి జోడీగా మేఘా ఆకాష్ నటిస్తుంది. మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు మంచి పేరు, లాభం తీసుకురావాలని కోరుకుంటున్నా’’నని అన్నారు నటుడు, నిర్మాత డి.యస్ రావు (D.S. Rao). 


చిత్ర  దర్శక, నిర్మాత లంక శశిధర్ మాట్లాడుతూ.. ‘‘ఇది నా మొదటి చిత్రం. నన్ను ఎంకరేజ్ చేసిన  నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని తీయడం జరిగింది. భారీ గ్రాఫిక్స్‌తో లవ్ అండ్ ఎంటర్‌టైనర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్‌గారికి ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రానికి మంచి ప్లానింగ్ కుదిరింది. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలలో ఈ సినిమా షూట్ చేసి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం..’’ అని తెలిపారు. క్రియేటివ్ హెడ్ లంక శివశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘మా చిన్నబ్బాయి లంక శశిధర్‌కు సినిమా అంటే చిన్నప్పుటి నుండి ఎంతో ఇష్టం. దర్శకుడు అవ్వాలనే తన కల ఇప్పుడు ఈ సినిమాతో తీరుతుంది. ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు. ఇంకా హీరో సుమంత్ సైలేంద్ర, హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. ఈ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చిందని, షూటింగ్ కోసం ఎగ్జయిటింగ్‌గా వేచిచూస్తున్నామని తెలిపారు. (Om Sri Kankadurga Opening)

Om Sri Kankadurga: దేవతగా వరలక్ష్మి శరత్ కుమార్.. మూవీ మొదలైంది


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement