Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద అంచనాల్లో ప్రభుత్వ వైఫల్యం

 అమరావతి రాజధానిగా ఉండాలనేది ప్రజల ఆకాంక్ష

 మాజీ మంత్రి దేవినేని ఉమ

పొదలకూరు, నవంబరు 27 : వరద అంచనాల్లోనూ, ప్రజలకు రక్షణ  చర్యలు కల్పించడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పొదలకూరులో ఇటీవల మరణించిన దేవినేని కృష్ణయ్యనాయుడు కుటుంబ సభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణయ్యనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టులు, చెరువులు తెగిపోవడానికి, వరదల్లో ప్రజల  ప్రాణ, ఆస్తి నష్టానికి  కారణం మానవతప్పిదంగానే భావించవచ్చని చెప్పారు. ప్రభుత్వ అసమర్థత, తెలివి తక్కువతనం వల్లే ఇంతమంది ప్రాణాలు పోయాయన్నారు. ఇరిగేషన్‌ మంత్రి అసలున్నాడా.. అన్నట్లుగా ఉందన్నారు. 


 అమరావతే ప్రజల ఆకాంక్ష


అమరావతి రాజఽధానిగా ఉండాలన్నదే ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని, రాజధాని కోసం 200 మంది బలిదా నాలు చేశారని ఉమ పేర్కొన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా మాట్లాడడం సరికాదన్నారు.  రాళ్లు పడతాయన్న అమరావతి రైతుల యాత్రకు ప్రజలు పూలతో బ్రహ్మరథం పడుతున్నారన్నారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్‌బాబు, బొద్దులూరు మల్లికార్జున నాయుడు, దేవినేని శరత్‌బాబు, సుందరరామిరెడ్డి, ఆదాల సుగుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.--------------


Advertisement
Advertisement