ఎల్‌ఎసాగరం పాఠశాలలో వంటగదిని ప్రారంభిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త కిషోర్‌బాబు
నాయుడుపేట టౌన్, జనవరి 19 : పట్టణంలోని లోతు వానిగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రముఖ పారిశ్రామికవేత్త పెసల కిషోర్‌బాబు వంటశాల గదిని ప్రారంభించారు. దాతల దాతృత్వం రూ. 2.50 లక్షలతో ని ర్మించి ప్రారంభించడం అభినందనీయమన్నారు. అనంత రం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అన్నామణి, విశ్రాంత ఉపాధ్యాయుడు హెచ్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.