Abn logo
Sep 21 2021 @ 14:16PM

ఏపీని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం: జగన్

విజయవాడ: ఎగుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవ్‌-2021’ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ రెండేళ్లలో అనేక సవాళ్లు ఎదురైనా... రాష్ట్రం పారిశ్రామికంగా గణనీయ వృద్ధి సాధించిందన్నారు. 2021లో ఎగుమతుల్లో 19.4 శాతం మేర వృద్ధి నమోదయిందన్నారు. 68 మెగా పరిశ్రమలతో రూ.30,175 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. మరో 62 మెగా ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. 3 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, రాష్ట్రానికి పరిశ్రమ వర్గాలు సహకరించాలని సీఎం జగన్‌ కోరారు.

ఇవి కూడా చదవండిImage Caption