వాణిదేవిని గెలిపించాలి:కేకే

ABN , First Publish Date - 2021-02-27T22:01:27+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణిదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాజ్యసభ ఎంపీ కేశవరావు పిలుపునిచ్చారు.

వాణిదేవిని గెలిపించాలి:కేకే

హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణిదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాజ్యసభ ఎంపీ కేశవరావు పిలుపునిచ్చారు. శనివారం బంజారాహిల్స్ లేక్ వ్యూ ఫంక్షన్ హాల్‌లో టీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలు హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభ నిర్వహించారు... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ కేశవరావు హాజరయ్యారు. వారితో పాటు  మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్యే దానం నాగేందర్,  ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ..  ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి గొప్ప విద్యావేత్త, జాతీయ, అంతర్జాతీయ  అంశాలపై వాణిదేవికి అవగాహన ఉందన్నారు. ఆమెను గెలిపిస్తే పట్టభ్రదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. పట్టభ్రదులైన ఓటర్లను  టీఆర్ఎస్ నేతలు కలవాలని చెప్పారు.  పట్టభ్రదులకు టచ్‌లో ఉండి ఓటు వేయించాలని  కేశవరావు కోరారు.  ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు చాలా ప్రాధాన్యం ఉందన్నారు.. ప్రతిపక్షాలను నమ్మొద్దని సూచించారు. మాజీ ప్రధాని పీవీ తీసుకొచ్చిన సంస్కరణాల వల్లే దేశం అన్నిరంగాల్లో ముందుకెళ్తుందన్నారు. వాణి దేవిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే పీవీకి, వారి కుటుంబానికి గౌరవించిన వాళ్లమవుతామని దానం నాగేందర్ పేర్కొన్నారు.


మేయర్ గద్వాల విజయ‌లక్ష్మీ మాట్లాడుతూ.. హైదరాబాద్, రంగారెడ్డి,మహబుబ్ నగర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా  సీఎం కేసీఆర్ మహిళకు సీటు ఇచ్చారన్నారు. దాదాపుగా 150,000 వేల పట్టభద్రులను తీర్చిదిద్దిన ఘనత వాణి దేవిదేనని విజయ‌లక్ష్మీ చెప్పారు. వాణిదేవిని గెలిపించాలని విజయ‌లక్ష్మీ కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి  సురభి వాణిదేవి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యలు తెలుసని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని చెప్పారు. నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యలు  తనకు తెలిసినంతగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిల్చున్న ఏ ఒక్క అభ్యర్థికి తెలియదన్నారు.. పట్టభద్రులంతా  ఓటేయాలని వాణిదేవి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-02-27T22:01:27+05:30 IST