నగరి నుంచి పోటీ చేస్తా: వాణీ విశ్వనాథ్‌

ABN , First Publish Date - 2022-03-10T02:20:20+05:30 IST

వచ్చే ఎన్నికల్లో తాను చిత్తూరు జిల్లా నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సినీ నటి వాణీవిశ్వనాథ్‌ తెలిపారు.

నగరి నుంచి పోటీ చేస్తా: వాణీ విశ్వనాథ్‌

నగరి: వచ్చే ఎన్నికల్లో తాను చిత్తూరు జిల్లా నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సినీ నటి వాణీవిశ్వనాథ్‌ తెలిపారు. నగరిలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నగరి నియోజకవర్గంలో వేలాదిగా ఉన్న తన అభిమానుల కోరిక మేరకు ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  అయితే  ఏ  పార్టీ నుంచి పోటీ చేస్తాననేది ఇప్పుడే చెప్పలేనన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా అయినా సరే బరిలో ఉంటానని స్పష్టం చేశారు. నగరిలో తమ అమ్మమ్మ నర్సుగా పని చేసిందని, ఇక్కడ తమిళ సంస్కృతి కూడా ఉందని అందుకే నగరిని ఎంపిక చేసుకున్నానని వివరించారు. నగరికి చెందిన రామానుజం చలపతితో కలసి వచ్చిన ఆమెకు 1వ వార్డు సామాలమ్మగుడి వద్ద మంగళ హారతులతో స్వాగతం పలికారు. రామానుజం చలపతికి జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక నగరి నుంచే ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధపడ్డానని వాణీవిశ్వనాథ్ ప్రకటించారు. 

Updated Date - 2022-03-10T02:20:20+05:30 IST