Aug 19 2021 @ 12:50PM

Salaar: 'సలార్‌'లో వాణి కపూర్ ..!

పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ 'సలార్‌'‌. ఇందులో మరో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ నటిస్తుందని తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్‌ నీల్‌ 'సలార్‌' రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా 1970ల పీరియడ్‌లో జరుగుతుందని తెలుస్తోంది. అప్పటి పాకిస్దాన్ - ఇండియా వార్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుందని సమాచారం.

కేజీఎఫ్ ఛాప్టర్ 1, ఛాప్టర్ 2 సినిమాల కంటే రెట్టింపు యాక్షన్ సీన్స్ 'సలార్‌'లో ఉండేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడట. సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మరో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ నటిస్తుందని తాజా సమాచారం. వాణీ కపూర్ తెలుగులో 'ఆహా కళ్యాణం' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలలో కనిపించలేదు. అయితే బాలీవుడ్‌లో ఈమెకి మంచి క్రేజ్ ఉంది. ఆ కారణంగానే 'సలార్‌'లో వాణీ కపూర్ ని ప్రశాంత్ నీల్ తీసుకున్నాడట. హోంబలే నిర్మాణ సంస్థలో విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు.