Jul 27 2021 @ 18:58PM

ఎరుపు దుస్తుల్లో వాణి మెరుపులు

‘దైవమగన్‌’ అనే సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న వాణీ భోజన్‌.. ‘ఓ మై కడవుళే’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌ వెండితెరపై తొలిసారి కనిపించింది. ఆమె నటించిన తొలి చిత్రమే ఘనవిజయం సాధించడంతో ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ కోవలో ‘లాకప్‌’, ‘మలేషియా టు అమ్నీషియా’ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘సియాన్‌-60’, ‘కాసినో’, ‘పగైవన్‌కు అరుళ్‌వాయ్‌’ తదితర చిత్రాలతో పాటు దాదాపు అర డజను ప్రాజెక్టులకు పైగా చేతిలో ఉన్నాయి. ఇదిలావుంటే, తనకంటూ అభిమానగణాన్ని సంపాదించుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ఆమె సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. అదేసమయంలో ఆమె ప్రత్యేక ఫొటోషూట్‌లు నిర్వహించి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ తన అభిమానుల్ని అలరిస్తోంది. తాజాగా ఆమె పాల్గొన్న ఫొటోషూట్‌ను చిన్న వీడియోగా చిత్రీకరించి, ఈ వీడియోకు మిన్ననే పాటను జతచేసి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఎరుపు దుస్తుల్లో వాణీ భోజన్‌ మెరిసిపోయింది.