ప్రకాశం: ఒంగోలు పీఎస్‌లోనే ఇద్దరు తెలుగు మహిళలను పోలీసులు ఉంచారు. రాత్రి 10 దాటినా పీఎస్‌లోనే కూర్చోబెట్టినట్లు బాధితులు వాపోతున్నారు. ఒంగోలు పోలీసుల లక్ష్మీ, సీతమ్మ అనే మహిళలు ఉన్నారు. మధ్యాహ్నం హోంమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారని తెలుగు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలని చూడకుండా పీఎస్‌లో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒంగోలు పోలీసుల తీరుపై తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తెలుగు మహిళలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూల్స్‌కు విరుద్ధంగా రాత్రి 10 దాటినా పీఎస్‌లో మహిళలను కూర్చోబెట్టడం సరికాదని వంగలపూడి అనిత మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి