AP News: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై జాతీయ పోరాటం: వంగలపూడి అనిత

ABN , First Publish Date - 2022-08-09T01:38:57+05:30 IST

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు

AP News: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై జాతీయ పోరాటం: వంగలపూడి అనిత

సింహాచలం: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ప్రకటించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు పూర్తిగా రక్షణ కరువైందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. అధికార పార్టీ నేతలు అంబటి రాంబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు నుంచి ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Gorantla Madhav) వరకు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినప్పటికీ కనీసం క్రమశిక్షణ చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో సీఎం ఉన్నారని ఎద్దేవాచేశారు. అందుకే జాతీయ స్థాయిలో మహిళా కమిషన్‌ను కలిసేందుకు, కేంద్ర హోం మంత్రిని కలిసేందుకు, దేశవ్యాప్తంగా మహిళా పార్లమెంటేరియన్ల మద్దతు కూడగట్టేందుకు త్వరలో అఖిలపక్ష ప్రతినిధి బృందంతో ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన కార్యాచరణ రూపకల్పనకు అఖిలపక్ష మహిళా నేతలతో అత్యవసర సమావేశం త్వరలో ఏర్పాటు చేస్తున్నట్టు అనిత ప్రకటించారు.

Updated Date - 2022-08-09T01:38:57+05:30 IST