హోంమంత్రికి బుర్ర ఉందా?: వంగలపూడి అనిత

ABN , First Publish Date - 2020-10-28T19:31:01+05:30 IST

దిశ చట్టం చేయటం వల్ల కేసులు తగ్గాయని చెబుతున్న హోంమంత్రి సుచరితకు బుర్ర ఉందా? అని టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర అద్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. దిశ లేని దిశ చట్టం చేసి మహిళలను మోసం చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు

హోంమంత్రికి బుర్ర ఉందా?: వంగలపూడి అనిత

రాజమండ్రి: దిశ చట్టం చేయటం వల్ల కేసులు తగ్గాయని చెబుతున్న హోంమంత్రి సుచరితకు బుర్ర ఉందా? అని టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర అద్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. దిశ లేని దిశ చట్టం చేసి మహిళలను మోసం చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జగన్‌ పాలనలో అత్యాచారాలపై టీడీపీ ఆధ్వర్యంలో నారీ భేరీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగలపూడి అనిత, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మంత్రి జవహర్‌, కార్యకర్తలు హాజరయ్యారు. 


ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. ‘చట్టంలో సవరణలు చేసి పంపాలని దిశ చట్టాన్ని కేంద్రం వెనక్కి పంపింది. ఏపీలో 300కి పైగా దిశ పోలీస్ స్టేషన్ల‌లో కేసులు నమోదు అయినా ముఖ్యమంత్రి ఇప్పటివరకు నోరు మెదపలేదు. గన్ కన్నా ముందే జగన్ వస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ మహిళలు గొప్పలు చెప్పారు. ఇప్పుడేం సమాధానం చెబుతారు. దిశ పోలీస్ స్టేషన్‌లు కాదు.. కౌన్సిలింగ్ సెంటర్‌లు పెట్టండి. దిశ పథకమా? చట్టమా? సమాధానం చెప్పండి’ అని అనిత అడిగారు.


అత్యాచారాలు పెరగలేదా?: భవానీ

దిశ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తిరిగి పంపిందని ఎమ్మెల్యే ఆదిరెఢ్డి భవానీ తెలిపారు. ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దిశ చట్టం వచ్చిన తర్వాత ఏపీలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. నాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగితే దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నాకు న్యాయం జరగలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-10-28T19:31:01+05:30 IST