Vande Bharat Express: సక్సెస్‏ఫుల్‌గా వందే భారత్‌ వర్షన్‌ 2.0

ABN , First Publish Date - 2022-09-21T17:29:30+05:30 IST

స్థానిక ఐసీఎఫ్‏లోని ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (వెర్షన్‌ 2.0) మూడో ర్యాక్‌ను విజయవంతం పూర్తిచేశారు. ఈ సందర్భంగా

Vande Bharat Express: సక్సెస్‏ఫుల్‌గా వందే భారత్‌ వర్షన్‌ 2.0

                                 - స్వీట్లు పంచిన ఐసీఎఫ్‌ అధికారులు 


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 20: స్థానిక ఐసీఎఫ్‏లోని ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (వెర్షన్‌ 2.0) మూడో ర్యాక్‌ను విజయవంతం పూర్తిచేశారు. ఈ సందర్భంగా పురస్కరించుకుని 9800 మంది ఐసీఎఫ్‌ ఉద్యోగులతో పాటు అప్రెంటీస్‏లను అభినందించిన ఐసీఎఫ్‌ ఉన్నతాధికారులు స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జీఎం ఏకే అగర్వాల్‌ మాట్లాడుతూ, రైల్వే మంత్రి వైష్ణవ్‌ అశ్విన్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఐసీఎఫ్‌ సిబ్బంది పనితీరును ప్రశంచారని తెలిపారు. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేశామని, త్వరలోనే పట్టాలపైకి రానున్న ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు టెక్నాలజీని 2.0 వెర్షన్‌లోకి విజయవంతంగా పూర్తిచేసినట్టు తెలిపారు. 2022-23 సంవత్సరంలో ఐసీఎఫ్‌ నుంచి 27 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఈ వెర్షన్‌లోకి మార్చేందుకు కృషి చేస్తున్నామని జీఎం  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-21T17:29:30+05:30 IST